Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేబులో పేలిన ఫోన్..!!

జేబులో పేలిన ఫోన్..!!

వార్త 2 months ago

Phone Exploded : ప్రస్తుతం అల్లాడిస్తున్న ఎండ తీవ్రత మానవాళినే కాదు, మనం వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను సైతం అతలాకుతలం చేస్తోంది. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా, మగ్దుంపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన మొబైల్ వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

గ్రామానికి చెందిన చంద్ర గౌడ్ అనే వ్యక్తి తన షర్ట్ జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకోగా, ఎండ వేడిమికి అది ఒక్కసారిగా విపరీతంగా వేడెక్కిపోయి పేలిపోయింది. అయితే, జేబులో ఏదో తేడా జరుగుతోందని చంద్ర గౌడ్ సకాలంలో గమనించి, అప్రమత్తమై ఫోన్‌ను దూరంగా తీసివేయడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also : ఇక నిమ్స్‌లో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!

వేసవిలో స్మార్ట్‌ఫోన్ల భద్రత.. నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ఇవే!

ఎండలు మండిపోతున్న ఈ వేసవి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొబైల్స్ లోపల ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు త్వరగా వేడెక్కి ‘థర్మల్ రన్‌అవే’ అనే ప్రక్రియకు లోనవుతాయి, దీనివల్ల బ్యాటరీ ఉబ్బి పేలిపోయే ప్రమాదం ఉంది. మొబైల్ వాడుతున్నప్పుడు లేదా జేబులో ఉన్నప్పుడు అది సాధారణం కంటే ఎక్కువ వేడెక్కినట్లు అనిపిస్తే.. తక్షణమే దాని వాడకాన్ని నిలిపివేయాలని, కాసేపు స్విచ్ఛాఫ్ చేసి చల్లని ప్రదేశంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో నేరుగా ఫోన్లను ఉంచడం, ఛార్జింగ్ పెడుతూ మాట్లాడటం వంటి పనులకు దూరంగా ఉండటం ద్వారా ఇలాంటి ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణలో తడిసిన ధాన్యం కూడా కొంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha