ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ బాధితుల కోసం కాంగ్రెస్ విచారణ జరపాలంటూ ఆమె అనూహ్యంగా డిమాండ్ చేశారు. తనను ట్రంప్‌కు ఎప్‌స్టీన్ పరిచయం చేశారన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
తన గౌరవాన్ని తగ్గించేందుకు చేసిన చెడ్డ ప్రయత్నాలని ఆరోపించారు. మెలానియా ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు చేశారనేదానిపై స్పష్టత లేదు. ఎప్‌స్టీన్‌పై మెలానియా ప్రకటన చేస్తారని ఆమె కార్యాలయం నుంచి ముందస్తుగా ఎలాంటి సంకేతం రాలేదు. వైట్ హౌస్ దీని గురించి ప్రస్తావించలేదు. తాను ఎప్‌స్టీన్ బాధితురాలిని కాదని మెలానియా అన్నారు. 2000వ సంవత్సరంలో ఆయనతో కేవలం పరిచయం ఉందని తెలిపారు. ”బాధితులపై ఎప్‌స్టీన్ చర్యల గురించి నాకేమీ తెలియదు. నేనెప్పుడూ ఇందులోభాగం కాలేదు. నాకెలాంటి సంబంధం లేదు” అని మెలానియా చెప్పారు. ఎప్‌స్టీన్ సహచరి గిలేన్ మ్యాక్స్‌వెల్ తనకు తెలుసన్న ఆరోపణలనూ ఆమె ఖండించారు. 2002లో తనకు, మ్యాక్స్‌వెల్‌కు మధ్య జరిగిన ఈ మెయిల్ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో విడుదల కావడంపై ఆమె స్పందించారు. అది సాధారణ, మర్యాదపూర్వక ప్రతిస్పందన మాత్రమేననన్నారు.
Read Also: US Iran Talks Pakistan : అమెరికా 15 సూత్రాల ప్రణాళికపై స్పందించిన ఇజ్రాయెల్
Jeffrey Epstein
ఆ మెయిల్ ”జి” అనే వ్యక్తికి బహుశా గిలేన్‌కు చేసినది కావొచ్చు. 'జేఈ'(జెఫ్రీ ఎప్‌స్టీన్) గురించి న్యూయార్క్ మ్యాగజీన్‌లో వచ్చిన కథనాన్ని ప్రశంసిస్తూ ఒక ఫోటో గురించి చెప్పారు. పామ్ బీచ్‌కు వెళ్లడానికి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని రాశార”మీరు మళ్లీ న్యూయార్క్ వచ్చినప్పుడు కాల్ చేయండి. హావ్ ఏ గ్రేట్ టైమ్. లవ్, మెలానియా” అని రాశారు.
Jeffrey Epstein: ఆయనకు కూడా నాలాగే అందమైన మహిళలంటే ఇష్టం
'బాధితులందరికీ అవకాశం కల్పించాలి' ఎప్‌స్టీన్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనతో ఉండడం సరదాగా అనిపిస్తుందని డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా న్యూయార్క్ మ్యాగజీన్ ఆర్టికల్‌లో ఉన్నాయి. ”ఆయనకు కూడా నాలాగే అందమైన మహిళలంటే ఇష్టం. వారిలో చాలామంది చిన్నవాళ్లు” అని ట్రంప్ అన్నట్టు ఆ కథనంలో ఉంది. ”జెఫ్రీ తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు” అని ట్రంప్ చెప్పారు. బాధితులకు ప్రమాణపూర్వకంగా కాంగ్రెస్ ముందు నిజం చెప్పే అవకాశం ఇవ్వాలని మెలానియా ట్రంప్ చట్టసభ సభ్యులును కోరారు. ”ప్రతి మహిళా తాను కోరుకుంటే తన కథను అందరికీ చెప్పే అవకాశం తప్పనిసరిగా కల్పించాలి. కాంగ్రెస్ రికార్డుల్లో వారి ప్రకటనలను చేర్చాలి. అప్పుడు మాత్రమే మనకు నిజం తెలుస్తుంది” అని ఆమె అన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

