Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఝార్ఖండ్ హాస్టల్‌లో విషాదం.. పాముకాటుతో విద్యార్థిని మృతి

ఝార్ఖండ్ హాస్టల్‌లో విషాదం.. పాముకాటుతో విద్యార్థిని మృతి

వార్త 1 month ago

Jharkhand: ఝార్ఖండ్‌లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ గర్ల్స్ హాస్టల్‌లోకి చొరబడిన ఒక ప్రమాదకరమైన కట్లపాము, నిద్రిస్తున్న విద్యార్థినులపై దాడి చేసింది.

ఈ ఘటనలో 12 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

నిద్రిస్తుండగా ఒక్కసారిగా దాడి

లోహర్‌దగా జిల్లాలోని సన్‌వాసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహంలో ఈ దారుణం జరిగింది. హాస్టల్ గదిలో ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఒక విషసర్పం లోపలికి ప్రవేశించింది. మొదట ఒక బాలికను కాటు వేయడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. తోటి విద్యార్థినులు లేచి ఏం జరిగిందో తెలుసుకునే లోపే, ఆ పాము వరుసగా మరో ముగ్గురిని కరిచింది.

Jharkhand: ఒకరి పరిస్థితి విషమం.. యాజమాన్యంపై ఆగ్రహం

పాము కాటుకు గురైన 12 ఏళ్ల బాలికను ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు లోహర్‌దగా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, మరో బాలిక పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం రాంచీలోని ‘రిమ్స్’ (RIMS) ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. వసతి గృహంలో కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ పిల్లల ప్రాణాల మీదకు వచ్చిందని పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

నో మొబైల్ టవర్.. నో సిగ్నల్! BSNL కొత్త శాటిలైట్ ఫోన్.. కొనాలంటే ఆ పర్మిషన్ తప్పనిసరి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha