Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీలుగ విత్తనాల కోసం అన్నదాతల ఎదురు చూపులు

జీలుగ విత్తనాల కోసం అన్నదాతల ఎదురు చూపులు

వార్త 3 months ago

Telangana: తెలంగాణలో వానాకాలం పంటల సాగుకు సమయం ఆసన్నమవుతుండటంతో పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ విత్తనాల కోసం రైతులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మరో 20 రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కానుండడం, వానాకాలం సాగుకు పొలాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో భూసారాన్ని పెంచేందుకు జీలుగ విత్తనాలు కీలకమని అన్నదాతలు భావిస్తున్నారు.

జీలుగ విత్తనాల సరఫరా ఆలస్యమైతే వానాకాలం సాగు కూడా వెనుకబడుతుందని వాపోతున్నారు. ఎందుకంటే విత్తనాలు చల్లిన 40 రోజులకు పెరిగిన జీలుగ మొక్కలను కలియదున్నాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వరినాట్లు వేసుకోవాలి. ఈ నేపథ్యంలో జీలుగ విత్తనాలు పంపిణీ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు.

Read Also : పలు కార్పొరేషన్లకు నూతన చైర్మన్ల నియమిస్తూ ఉత్తర్వులు

2026-27 వానాకా లానికి జీలుగ పచ్చిరొట్ట విత్తనాల సరఫరా విషయంఓల వ్యవసాయశాఖ ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు మొదలుపెట్టకపోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సారి నైరుతి ముందే వస్తుందన్న వాతావరణశాఖ ప్రక టనతో అన్నదాతలు ఖరీఫ్ సాగుపై గంపెడాశలు పెట్టుకున్నారు. సాగులో కీలకమైన పచ్చిరొట్ట సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే జీలుగ విత్తనాల సరఫరాపై రాష్ట్ర వ్యవసాయశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గతంలో మాదిరిగా జీలుగ విత్తనాల కోసం అగ్రోస్ రైతు సేవా కేం ద్రాలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులుగాయాల్సి వస్తుందేమోనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో 30 కేజీల జీలుగ బస్తా ధర రూ. 1150 నుండి రూ.2150కి పెరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ జిల్లాలకు కలిపి జిల్లాకు సగటున 6 వేల క్వింటాళ్ల కిలోల జీలుగ విత్తనాలు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి లక్షా50వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరమవుతాయని అంచనా. నేల సారాన్నిపెంచడానికి, వరిసాగుకు ముందు జీలుగ చాలా కీలకమైనది కావడంతో వ్యవసాయశాఖ వేగంగాస్పందించి సబ్సిడీపై జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఇంటర్ బోర్డు రద్దుకు తెలంగాణ సర్కార్ కసరత్తు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha