Zimbabwe Boat Accident: జింబాబ్వేలోని ప్రసిద్ధ కరీబా సరస్సులో (Lake Kariba) ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరొక 27 మంది నీటిలో గల్లంతయ్యారు.
Read Also :India : ఇండియాపై ఈ రెండు దేశాలు దాడి చేయబోతున్నాయా ?

Zimbabwe Boat Accident: ప్రమాద వివరాలు & సహాయక చర్యలు
ప్రమాద సమయంలో పడవలో 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది కలిపి మొత్తం 119 మంది ఉన్నారు. టికెట్లు తీసుకోని చిన్న పిల్లలు కూడా పడవలో ఉండే అవకాశం ఉందని, దాంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు పడవ అసలు సామర్థ్యం కేవలం 90 మంది మాత్రమే. అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు హెలికాప్టర్ల సహాయంతో కరీబా సరస్సులో గాలింపు చర్యలు మరియు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.
నా హత్యకు ఇరాన్ కుట్ర.. తుర్కియేలో రహస్యంగా విమానం మార్చా: ట్రంప్

