Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జిన్‌పింగ్ నా మిత్రుడు.. అద్భుతమైన నాయకుడు: ట్రంప్

జిన్‌పింగ్ నా మిత్రుడు.. అద్భుతమైన నాయకుడు: ట్రంప్

వార్త 1 week ago

Donald Trump Xi Jinping Meeting: అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, తైవాన్ వివాదం వంటి తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, బీజింగ్‌లో షీ జిన్‌పింగ్‌తో జరిగిన ముఖాముఖి భేటీలో ట్రంప్ అత్యంత సానుకూలంగా స్పందించారు.

జిన్‌పింగ్‌ను తన ‘మిత్రుడు’ అని సంబోధిస్తూ, ఇరు దేశాల మధ్య గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also:Donald Trump: చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్.. స్వాగతం పలకని షీ జిన్‌పింగ్

ట్రంప్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

జిన్‌పింగ్ ఒక శక్తివంతమైన , గొప్ప నాయకుడని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవమని ట్రంప్ పేర్కొన్నారు.అనేక క్లిష్ట సమస్యలను తాము ఫోన్ ద్వారానే చర్చించుకుని పరిష్కరించుకున్నామని, ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియదని వెల్లడించారు.తనతో పాటు అమెరికాలోని అత్యుత్తమ వ్యాపారవేత్తల బృందాన్ని తీసుకువచ్చానని, వారంతా చైనా నాయకత్వం పట్ల గౌరవంతో ఉన్నారని తెలిపారు.

 Donald Trump praises Xi Jinping Beijing

Donald Trump Xi Jinping Meeting: విశ్లేషకుల అభిప్రాయం: ఆర్భాటమేనా.. ఆచరణా?

ప్రధాని మోదీ సూచనల నేపథ్యంలో భారత్ వంటి దేశాలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంటే, ప్రపంచాన్ని శాసించే ఈ ఇద్దరు నేతల భేటీ మాత్రం ప్రతీకాత్మక అంశాలకే పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.వాణిజ్య సుంకాలు, తైవాన్ భద్రత, AI పరిమితులపై కఠినమైన నిర్ణయాలు వెలువడే అవకాశం తక్కువని, కేవలం ‘సత్సంబంధాల’ ప్రదర్శనకే ఈ భేటీ పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు.చర్చల ప్రారంభంలో ఇంత సానుకూలంగా స్పందించిన ట్రంప్, చర్చలు ముగిసే సమయానికి తైవాన్ వంటి సున్నిత అంశాలపై చైనాను ఎలా ఒప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha