Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జియో IPOకి గ్రీన్ సిగ్నల్..ముకేశ్ అంబానీ కీలక ప్రకటన!

జియో IPOకి గ్రీన్ సిగ్నల్..ముకేశ్ అంబానీ కీలక ప్రకటన!

వార్త 2 weeks ago

Reliance AGM 2026 | ముంబై, జూన్ 19: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థలలో ఒకటైన జియో ఇన్ఫోకామ్ త్వరలో భారీ ఐపీఓ (IPO)తో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (Reliance AGM Meeting)లో సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు.

జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు ఇప్పటికే ఐపీఓ ముసాయిదా పత్రాలకు ఆమోదం తెలిపిందని, వాటిని భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)కి సమర్పిస్తున్నట్లు అంబానీ వెల్లడించారు. ఈ ఐపీఓ ద్వారా జియో ఇన్ఫోకామ్ సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.36,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల వరకు) సమీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

దేశంలో డిజిటల్ సేవలు, 5జీ విస్తరణ, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ రంగాల్లో జియో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ ఐపీఓపై పెట్టుబడిదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది. జియో స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయితే భారత టెలికాం రంగంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

Reliance AGM 2026 meeting live updates

మరోవైపు జియో ప్లాట్‌ఫామ్స్ విలువను మరింత పెంచేందుకు డిజిటల్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సేవలు, 5జీ నెట్‌వర్క్ విస్తరణపై సంస్థ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

జియో ఐపీఓ ప్రకటనతో దేశీయ పెట్టుబడిదారులు, మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సెబీ అనుమతుల అనంతరం ఐపీఓ షెడ్యూల్, ధరల శ్రేణి, షేర్ కేటాయింపు వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Epaper: epaper.vaartha.com

PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే 8.25% వడ్డీ జమ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha