Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
J&K సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు!

J&K సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు!

వార్త 3 weeks ago

Omar Abdullah Payal Divorce: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), ఆయన భార్య పాయల్ అబ్దుల్లాల మధ్య గత 17 ఏళ్లుగా నడుస్తున్న వైవాహిక వివాదానికి దేశ అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు అంతం పలికింది.

ఇరుపక్షాలు రాజీకి వచ్చి, పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకోవడంతో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేసింది.

Read Also :Supreme Court : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత బాధితులకు న్యాయం చేయండి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో ఏం జరిగింది?

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ముందు ఒమర్ అబ్దుల్లా తరఫు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. "ఇద్దరూ స్వేచ్ఛను కోరుకుని సామరస్యపూర్వకంగా ఒప్పందానికి వచ్చారు. ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటున్నారు" అని వెల్లడించారు. దీనికి స్పందించిన కోర్టు, ఒప్పంద నిబంధనల ప్రకారం కేసులను ముగిస్తున్నట్లు ప్రకటించింది.

Omar Abdullah Payal Divorce:కేసు నేపథ్యం

సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒమర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం ఇరువర్గాలను మీడియేషన్ సెంటర్‌కు పంపించింది. అక్కడ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధపడటంతో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

ప్రేమ పెళ్లి: 1994 సెప్టెంబర్ 1న ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో కలుసుకున్న ఒమర్, పాయల్‌లు వివాహం చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

మనస్పర్థలు & విడిపోవడం: 2009 నుండి ఇద్దరూ విడిగా నివసిస్తున్నారు. 2011లో ఒమర్ విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.

కోర్టు కేసులు: ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను 2016లో ఫ్యామిలీ కోర్టు, 2023 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి.

భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్: గాల్వాన్ ఘటన తర్వాత మొదటిసారి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha