Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జులై 24న విజయ్ 'జన నాయగన్' విడుదల ?

జులై 24న విజయ్ 'జన నాయగన్' విడుదల ?

వార్త 1 month ago

Vijay Jana Nayagan Movie: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ, వివాదాల తర్వాత ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన అన్ని మార్పులను చిత్రబృందం పూర్తి చేసింది. శుక్రవారం నాటికి సెన్సార్ సర్టిఫికెట్ చేతికి అందే అవకాశం ఉండటంతో, నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది.

Read Also : Dune 3 trailer: డూన్ 3 ట్రైలర్ రివ్యూ.. ఈసారి యుద్ధం పీక్ లెవల్లోనే!

 Will Vijay's 'Jana Nayagan' be released on July 24?

Vijay Jana Nayagan Movie: కెనడా డిస్ట్రిబ్యూటర్స్ క్రేజీ పోస్ట్.. జులై 24న థియేటర్లలోకి!

ఈ సినిమాను జులై 24న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు బలమైన ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘యార్క్ సినిమాస్’ (York Cinemas) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎట్టకేలకు మన దళపతి విజయ్ 'జన నాయగన్'తో వెండితెరపై మంటలు పుట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. జులై 24 నుంచి కెనడా థియేటర్లలోకి వస్తోంది అని పేర్కొంది. ఒకవేళ చిన్నపాటి మార్పులు జరిగితే, ఒకరోజు ముందుగా అంటే జులై 23నే సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

వివాదాలు, కోర్టు కేసులు, ఆన్‌లైన్ లీక్

విజయ్ రాజకీయాల్లోకి రాకముందు సైన్ చేసిన చివరి చిత్రం కావడంతో 'జన నాయగన్'పై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. అయితే 2025 డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపినప్పుడు, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రజా మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే ఫిర్యాదులతో ప్రక్రియ నిలిచిపోయింది. తమిళనాడు ఎన్నికల ముందు ఈ సినిమా వస్తే విజయ్‌కు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. మద్రాస్ హైకోర్టు వరకు వెళ్లిన ఈ వివాదం అనంతరం రివైజింగ్ కమిటీకి చేరింది. ఈ గందరగోళం మధ్యలోనే ఏప్రిల్‌లో ఈ సినిమా హై-డెఫినిషన్ (HD) కాపీ ఆన్‌లైన్‌లో లీక్ కావడం సంచలనం సృష్టించింది. పైరసీ సైట్ల నుంచి తొలగించేలోపే దాదాపు 1.2 కోట్ల మంది ఈ సినిమాను చూశారని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఇప్పుడు థియేటర్లలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక 'మైసా' క్రేజీ అప్‌డేట్.. నీటి అడుగున నేషనల్ క్రష్ భారీ యాక్షన్ స్టంట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha