Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన

జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన

వార్త 3 weeks ago

Ayatollah Ali Khamenei: ఇరాన్ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రణాళికను ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రకటించింది.

ఖమేనీ సంస్మరణ కార్యక్రమాల నిర్వహణ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే నెల (జూలై) 4వ తేదీ నుంచి రాజధాని టెహ్రాన్‌లో అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ కార్యక్రమం మార్చి నెలలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది.

Read also: G7 సదస్సులో మోదీ-ట్రంప్ సమావేశం..అధికారిక ప్రకటన చేసిన వైట్ హౌస్

వివిధ నగరాల్లో అంతిమ యాత్ర.. ఇమామ్ రెజా క్షేత్రంలో ఖననం

అధికారిక షెడ్యూల్ ప్రకారం.. జూలై 4, 5 తేదీలలో టెహ్రాన్‌లోని ప్రసిద్ధ ఇమామ్ ఖమేనీ ముసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌతికకాయానికి ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం వీడ్కోలు సభలు నిర్వహిస్తారు. అనంతరం జూలై 6, 7 తేదీలలో రాజధాని టెహ్రాన్‌తో పాటు పవిత్ర నగరమైన కోమ్ (Qom) లలో భారీ ఎత్తున అంతిమ యాత్రలు (Funeral Processions) సాగుతాయి. జూలై 9వ తేదీన దేశ ఈశాన్య దిశలోని మషద్ (Mashhad) నగరంలో తుది వీడ్కోలు కార్యక్రమం ముగుస్తుంది. అదే రోజున షియా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఎనిమిదో ఇమామ్ ‘ఇమామ్ రెజా’ పవిత్ర క్షేత్ర ప్రాంగణంలో ఖమేనీ పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు.

Ayatollah Ali Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యం.. ముగిసిన 36 ఏళ్ల పాలన

86 సంవత్సరాల వయసున్న అలీ ఖమేనీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడులలో మరణించారు. ఈ దాడులతో ఇరాన్ దేశంపై ఆయన సాగించిన 36 ఏళ్ల సుదీర్ఘ లీడర్‌షిప్ పాలనకు ముగింపు పడింది. ఈ వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవడు, అల్లుడు సహా మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ మరణానంతరం, మార్చి మొదటి వారంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

'లియాకి ఫ్రీడమ్' నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha