Nara Lokesh: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాఠశాల మరియు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆయన దిశానిర్దేశం చేశారు.

Read also: Pawan kalyan: ఢిల్లీలో పవన్ కీలక భేటీ.. ఏపీ నీటి సమస్యలపై కేంద్రంతో చర్చలు!
జులైలో 'తల్లికి వందనం' అమలు
విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే 'తల్లికి వందనం' పథకాన్ని జులై మూడో వారంలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని అధికారులు వివరించగా, పథకం అమలులో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని లోకేశ్ ఆదేశించారు.
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో జూన్ 29న 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే తల్లిదండ్రులను విద్యా వ్యవస్థలో భాగస్వాములను చేయడానికి జులై మూడో వారంలో 'మెగా పీటీఎం' నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల అందుబాటును సమతుల్యం చేసేందుకు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సెట్ పరీక్షల నిర్వహణలో జాప్యం వద్దు
ఉన్నత విద్యా రంగంపై సమీక్ష సందర్భంగా ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. త్వరితగతిన నోటిఫికేషన్లు విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల పరీక్షల షెడ్యూళ్లను కూడా పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు అనుకూలంగా తేదీలు ఖరారు చేయాలని సూచించారు.
ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఏర్పాట్లు
రాష్ట్రంలోని 254 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న 1.88 లక్షల సీట్ల భర్తీ కోసం ఎప్‌సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మెకానికల్, సివిల్ వంటి కోర్సుల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని మంత్రి సూచించారు.
ప్రపంచస్థాయి విద్యాసంస్థలకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న అంశంపై అధికారులతో చర్చించారు. జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేక ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర యువతకు సైనిక శిక్షణ, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధిలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

