Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 26 బ్యాంక్ హాలిడేనా? మొహర్రం సెలవులపై కీలక సమాచారం

జూన్ 26 బ్యాంక్ హాలిడేనా? మొహర్రం సెలవులపై కీలక సమాచారం

వార్త 1 week ago

Moharram Bank Holidays: మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం, జూన్ 26 (శుక్రవారం) నాడు దేశంలోని ప్రధాన నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

దీనికి తోడు మరుసటి రోజు జూన్ 27 నాల్గవ శనివారం, జూన్ 28 ఆదివారం కావడంతో ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.

Read Also : Hyderabad First IT Tower: హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ ఇక లేనట్లే.?

 Is June 26th a bank holiday? Important information on Muharram holidays

Moharram Bank Holidays: కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం

మొహర్రం నెలవంక దర్శనం ఆధారంగా కేరళ ప్రభుత్వం తమ సెలవుల షెడ్యూల్‌ను సవరించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం గురువారం (జూన్ 25) నాడు కాకుండా, అషూరా వాస్తవ దినమైన శుక్రవారం (జూన్ 26) నాడే ప్రభుత్వ అధికారిక సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో కేరళలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు బ్యాంకులు కూడా శుక్రవారమే మూతపడనున్నాయి.

జూన్ 26న బ్యాంకులు మూసి ఉండే నగరాల జాబితా

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జూన్ 26న మొహర్రం సందర్భంగా క్రింది ప్రధాన నగరాల్లో బ్యాంకింగ్ సేవలకు సెలవు ఉంటుంది. హైదరాబాద్ (తెలంగాణ) బెంగళూరు (కర్ణాటక) చెన్నై (తమిళనాడు) ముంబై, నాగ్‌పూర్ (మహారాష్ట్ర)
కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) న్యూఢిల్లీ (ఢిల్లీ) లక్నో, కాన్పూర్ (ఉత్తర ప్రదేశ్) భోపాల్ (మధ్యప్రదేశ్) జమ్ము, శ్రీనగర్ (జమ్ము కాశ్మీర్) పాట్నా (బీహార్) రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) రాంచీ (జార్ఖండ్) అగర్తలా (త్రిపుర) ఐజ్వాల్ (మిజోరం)
బెంగళూరు ఆయా రాష్ట్రాల్లో జూన్ 26న బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.

ఆన్‌లైన్ సేవలు నిరంతరం అందుబాటులో..

బ్యాంక్ శాఖలు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ (UPI) పేమెంట్స్, అలాగే ఏటీఎం (ATM) సేవలు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తాయి. కేవలం నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనుల (నగదు డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్, పత్రాల సమర్పణ) కోసం మాత్రమే ఈ సెలవులను గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ బిగ్ అప్‌డేట్.. 30% ఫీజు రద్దు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha