Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల 'ఎన్టీఆర్ మీల్'  సేవలకు ముగింపు

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల 'ఎన్టీఆర్ మీల్' సేవలకు ముగింపు

వార్త 1 month ago

Jr NTR Meal Service End: మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఎన్టీఆర్ మీల్' (NTR Meal) సేవా కార్యక్రమం ముగిసింది.

నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమాన్ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు శనివారం అధికారికంగా ప్రకటించారు. అభిమాన హీరో పేరుతో సామాజిక సేవలో ముందుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్ఫూర్తితో మొదలైన ఈ సేవలు నేటితో ముగియడం గమనార్హం.

Read Also :Pawan Kalyan Independence Day Speech: 'వికసిత్ భారత్'లో ఏపీ పాత్ర కీలకం.. పవన్ కల్యాణ్

'ఎన్టీఆర్ మీల్' సాధించిన మైలురాళ్లు

  • 150కి పైగా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 150కి పైగా కేంద్రాల్లో 'ఎన్టీఆర్ మీల్ కిట్స్' ద్వారా నిర్వాహకులు ఆహార పంపిణీ చేశారు.
  • 2000+ కిట్ల పంపిణీ: వండిన ఆహారాన్ని అందించడంతో పాటు సుమారు 2,000కు పైగా ప్రత్యేక కిట్లను నిరుపేదలకు పంపిణీ చేసి లక్షలాది మంది ఆకలి తీర్చారు.
  • కొరియర్ ద్వారా మారుమూల గ్రామాలకు: రవాణా సౌకర్యం సరిగా లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఎన్టీఆర్ మీల్ కిట్లను కొరియర్ ద్వారా చేరవేసి తమ సేవా నిరతిని చాటుకున్నారు.

మీల్ కిట్లను తిరిగి పంపాలని విజ్ఞప్తి

సేవలను నిలిపివేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు లబ్ధిదారులు మరియు వివిధ కేంద్రాల ప్రతినిధులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. గతంలో అందించిన 'ఎన్టీఆర్ మీల్ కిట్ల'ను వీలైనంత త్వరగా క్రింది చిరునామాకు కొరియర్ లేదా స్వయంగా అందించాలని కోరారు.

కిట్లు పంపాల్సిన చిరునామా:

TVH Ouranya Bay, OMR, Chennai, Tamil Nadu - 603103.

ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కిట్లన్నీ నిర్ణీత గడువులోగా కార్యాలయానికి చేరేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలని నిర్వాహక బృందం విజ్ఞప్తి చేసింది.

Jr NTR Meal Service End: వాలంటీర్లకు, అభిమానులకు కృతజ్ఞతలు

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ రక్తదానం, విపత్తు సహాయక చర్యల్లో ముందుంటారు. అదే బాటలో సాగిన 'ఎన్టీఆర్ మీల్' కార్యక్రమంలో వేలాది మంది వాలంటీర్లుగా మారి అహరహం శ్రమించారు. ఈ సేవలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిర్వాహక బృందం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.

ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha