Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్లో ఎన్ని రోజులు బ్యాంక్ సెలవులో తెలుసా ?

జూన్లో ఎన్ని రోజులు బ్యాంక్ సెలవులో తెలుసా ?

వార్త 2 months ago

Bank Holidays in June 2026 : జూన్ (2026) నెలలో బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లేవారు సెలవుల జాబితాను ముందుగానే చూసుకోవడం ఎంతో అవసరం. ఈ నెలలో సాధారణంగా వచ్చే ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలతో పాటు మొహర్రం పండుగ సెలవులు కూడా ఉన్నాయి.

క్యాలెండర్ ప్రకారం.. జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే జూన్ 13న రెండవ శనివారం, జూన్ 27న నాల్గవ శనివారం సందర్భగా బ్యాంకులకు అధికారికంగా సెలవు ఉంటుంది. వీటికి అదనంగా, మొహర్రం పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 25వ తేదీన, తెలంగాణలో జూన్ 26వ తేదీన బ్యాంకింగ్ సేవలకు విరామం ప్రకటించారు.

Read Also : గూగుల్ దోమల్లో ఉండే ఆ ప్రత్యేక బ్యాక్టీరియా ఏంటో తెలుసా?

 May 2026 Bank Holiday Calendar List

అందుబాటులో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు

పైన పేర్కొన్న సెలవు దినాల్లో బ్యాంకుల భౌతిక శాఖలు మూతపడినప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, యూపీఐ (UPI) నగదు బదిలీ సేవలు మరియు ఏటీఎం (ATM) సేవలు 24 గంటలూ యథావిధిగా పనిచేస్తాయి. అత్యవసరంగా డబ్బులు పంపాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవచ్చని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి. కాబట్టి చెక్కుల క్లియరెన్స్ లేదా పర్సనల్ లోన్ వంటి నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి చేసుకోవాల్సిన పనులను ఈ సెలవుల తేదీలను బట్టి ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారత్‌లో దాడులకు కుట్ర: దావూద్ ఇబ్రహీం అనుచరుడు మున్నా చుట్టూ తిరుగుతున్న నెట్‌వర్క్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha