MLA Mynampally Rohit Rao: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన దేశభక్తిని, ప్రజా బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.
తీవ్రమైన వైరల్ ఫీవర్, ఒళ్లు నొప్పులతో ఆరోగ్యం సహకరించకపోయినా ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకావిష్కరణలు నిర్వహించారు.
తీవ్ర జ్వరంతోనే చారిత్రక మెదక్ కోట పైకి
శనివారం ఉదయం 8:15 గంటలకు రాందాస్ చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, అనంతరం నేరుగా మెదక్ కోటకు చేరుకున్నారు. తీవ్ర జ్వరం, నీరసంతో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా ఎత్తైన మెదక్ కోటను కాలినడకన అధిరోహించారు. కోట శిఖర భాగంలో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అంత శ్రమకోర్చి కోట ఎక్కిన ఎమ్మెల్యే నిబద్ధత స్థానికులను, కాంగ్రెస్ కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.
MLA Mynampally Rohit Rao: వరుస కార్యక్రమాల్లో పాల్గొని నిబద్ధత
కోటపై జెండా ఆవిష్కరణ అనంతరం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 9:30 గంటలకు మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అధికారిక వేడుకలకు హాజరయ్యారు. అక్కడ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామితో కలిసి పరేడ్ గౌరవ వందనం స్వీకరించారు.

విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలోనూ ప్రజాప్రతినిధిగా బాధ్యతకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సేవా స్ఫూర్తిని స్థానిక ప్రజలు, నాయకులు కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ సీనియర్ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
లక్ష మందితో వందేమాతరం పాడుతాం.. దమ్ముంటే అడ్డుకోండి: బండి సంజయ్

