Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాగజ్‌నగర్ జిల్లాలో మట్టి మాఫియాపై అధికారుల ఉక్కుపాదం

కాగజ్‌నగర్ జిల్లాలో మట్టి మాఫియాపై అధికారుల ఉక్కుపాదం

వార్త 2 months ago

Kagaznagar news: చెరువుల పరిశీలనలో బయటపడిన అక్రమ మట్టి రవాణా,అనుమతులు లేని మూడు ట్రాక్టర్లు స్వాధీనం.మట్టి తరలింపులో నిబంధనలు తప్పనిసరి, జిల్లాలో అక్రమంగా మట్టి, ఇసుక తరలింపులను ఏమాత్రం సహించబోమని జిల్లా కలెక్టర్ కె.

హరిత స్పష్టం చేశారు. సరైన అనుమతులు లేకుండా మట్టి లేదా ఇసుక రవాణా చేపట్టిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కాగజ్‌నగర్ మండలంలోని గన్నారం, మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాల పరిధిలో ఉన్న చెరువులను ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.పరిశీలన సందర్భంగా నజ్రుల్‌నగర్ విలేజ్ నెం.12 గ్రామ పరిధిలో మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ట్రాక్టర్ల యజమానులను అనుమతులు, సంబంధిత పత్రాల గురించి ప్రశ్నించగా ఎలాంటి ధ్రువపత్రాలు చూపించలేకపోయారు. దీంతో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు నిర్ధారించిన కలెక్టర్ వెంటనే ఆ మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Read also:Telangana Politics: పవన్ కళ్యాణ్ తెలంగాణ వైఖరిపై రామచందర్ రావు క్లారిటీ

 Officials Crack Down Hard on the Sand Mafia

Kagaznagar news: అక్రమ రవాణాకు చెక్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ మట్టి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సహజ వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మట్టి లేదా ఇసుక రవాణా చేపట్టే ముందు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు, పాస్‌లు పొందిన తర్వాత మాత్రమే తరలించాలని సూచించారు. అనుమతులు లేకుండా రవాణా చేస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి, ఇసుక తరలింపుపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారాన్ని అధికారులకు అందించాలని కోరారు. ఈ తనిఖీల్లో కాగజ్‌నగర్ మండల తహసీల్దార్ మధుకర్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha