Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాగ్నిజెంట్‌కు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం!

కాగ్నిజెంట్‌కు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం!

వార్త 3 weeks ago

Cognizant: అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసా మరియు పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్ (Cognizant), క్లౌడెరా (Cloudera) సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ రెండు కంపెనీలకు సంబంధించిన గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను అమెరికా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి..

అమెరికా అధ్యక్ష కార్యాలయం ఏర్పాటు చేసిన వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ చేపట్టిన సమగ్ర దర్యాప్తులో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (అమెరికా కార్మిక శాఖ) అధికారికంగా వెల్లడించింది. ఈ విచారణ పూర్తిస్థాయిలో ముగిసే వరకు కాగ్నిజెంట్ ఎలాంటి కొత్త గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను సమర్పించడానికి వీలులేదని అధికారులు స్పష్టం చేశారు.

Cognizant: భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, టెక్కీలపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోవడంతో వీరందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

మధ్యంతర ఎన్నికల వరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha