Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కాకా'లో బాలీవుడ్ నటుడు

'కాకా'లో బాలీవుడ్ నటుడు

వార్త 2 weeks ago

Kaka : మెగాస్టార్ చిరంజీవి - మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా'పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఒక మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలకమైన, అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారు. డైరెక్టర్ బాబీ ఆయనకు సన్నివేశాన్ని వివరిస్తున్న వర్కింగ్ స్టిల్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విలక్షణ నటనకు పేరుగాంచిన అనురాగ్ కశ్యప్ రాకతో ‘కాకా’ సినిమా స్థాయి, రేంజ్ మరింత పెరిగిందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 kaka movie release date

శరవేగంగా షూటింగ్.. సంక్రాంతి బరిలో మెగా హవా!

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా బాబీ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడమే కాకుండా, అనురాగ్ కశ్యప్ లాంటి నటుడితో బిగ్ స్క్రీన్ పై డ్రామాను పండించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇక మెగా అభిమానులకు అసలైన పండగ విందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడం, దానికి తోడు బాలీవుడ్ క్రేజీ నటుడు తోడవడంతో సంక్రాంతి రేసులో ‘కాకా’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

'రామాయణం' షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha