Cockroach Janata Party: భారతదేశంలో డిజిటల్ వేదికగా సంచలనం సృష్టిస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ పార్టీకి సంబంధించిన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను భారతదేశంలో నిలిపివేస్తూ సామాజిక మాధ్యమ సంస్థ నిర్ణయం తీసుకుంది.
కేవలం కొద్దిరోజుల్లోనే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, యువతలో హాట్ టాపిక్‌గా మారిన ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్‌పై అకస్మాత్తుగా ఈ చర్య తీసుకోవడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
Read Also : Cockroach Janata Party: 'కాక్రోచ్ జనతా పార్టీ'.. అసలు ఎలా ప్రారంభమైంది?
A big shock to the ‘Cockroach Janata Party’.. Ex-account suspended in India!
సస్పెన్షన్‌పై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
కేవలం రెండు రోజుల్లోనే 50 వేలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై దూసుకుపోతున్న ఈ అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో నెటిజన్లు, ముఖ్యంగా 'జెన్ జీ' (Gen Z) యువత షాక్‌కు గురయ్యారు. ఈ సస్పెన్షన్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారంటూ కొందరు మండిపడుతుంటే.. నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఎక్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
అసలు ఎందుకు పుట్టింది ఈ పార్టీ?
ఇటీవల సుప్రీంకోర్టు విచారణలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి ‘కాక్రోచ్’, ‘పారాసైట్స్’ అనే పదాలు వాడారంటూ మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే అనే యువకుడు ఈ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వెబ్‌సైట్, గూగుల్ ఫామ్ ద్వారా కేవలం 72 గంటల్లోనే లక్ష మందికి పైగా నిరుద్యోగ యువత ఇందులో సభ్యులుగా చేరారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ పార్టీకి లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. అయితే, అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్న తరుణంలో ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కావడం ఈ డిజిటల్ ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

