Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరం ప్రాజెక్టుపై దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు

వార్త 2 months ago

Kaleshwaram Project: లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రజలకు, రైతులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోవడంపై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

గోదావరిఖని పర్యటనలో ఉన్న ఆయన, ప్రాజెక్టు ప్రస్తుత దయనీయ స్థితిపై నిప్పులు చెరిగారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ’ (NDSA) ఇప్పటికే స్పష్టమైన నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

 Kaleshwaram Project

ఎండిపోయిన బ్యారేజీలు.. సాగునీరు లేక ఉత్తర తెలంగాణ రైతుల ఆవేదన

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు ప్రధాన బ్యారేజీలలో ప్రస్తుతం కనీసం బొట్టు నీరు కూడా లేకపోవడం అత్యంత విచారకరమని దత్తాత్రేయ పేర్కొన్నారు. నీటి నిల్వలు లేకపోవడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల రైతాంగం తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిరుపయోగంగా మారుతున్నా, ప్రభుత్వం కంటితుడుపు చర్యలకే పరిమితమవుతోందని విమర్శించారు.

Read also: Weather Report in Telangana : తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

Kaleshwaram Project: కాలయాపన వద్దు.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి!

రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కాలయాపన స్వస్తి చెప్పి, నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి పునరుద్ధరణ పనులు చేపట్టాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ రైతులను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి, సాగునీరు అందించే బాధ్యతను ప్రభుత్వం తక్షణమే స్వీకరించాలని ఆయన హితవు పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్​ హత్య..ఏడుగురు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha