Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరం వివాదంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర ఆరోపణలు

కాళేశ్వరం వివాదంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర ఆరోపణలు

వార్త 3 weeks ago

KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో కరవు ఛాయలు అలముకుంటున్నప్పటికీ, గోదావరి నీటిని సముద్రం పాలు చేస్తూ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నారని ఆయన మండిపడ్డారు.

మిడ్ మానేరు వద్ద కేటీఆర్ పర్యటన

సోమవారం కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించిన కేటీఆర్.. అక్కడి నీటి నిల్వలను, తాజా పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి కొట్టుకుపోతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. దీనివల్ల పొలాలు ఎండిపోవడమే కాకుండా, హైదరాబాద్, కరీంనగర్ లాంటి నగరాల్లో తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరించారు.

KTR: కేసీఆర్ మార్క్‌ను చెరిపేసేందుకే.. ఎన్డీఎస్ఏ నివేదిక వంకతో డ్రామాలు!

గోదావరిలో తగినంత నీటి ప్రవాహం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సరిహద్దు అవతలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసుకుంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. “మరమ్మతులు పూర్తయినప్పటికీ, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను సాకుగా చూపిస్తున్నారు. కేసీఆర్ కట్టించిన ఈ అద్భుత ప్రాజెక్టుకు చెడ్డపేరు తేవడమే కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అజెండా” అని కేటీఆర్ విమర్శించారు.

‘కన్నెపల్లి’ నుంచి నీళ్లు ఎత్తిపోయకుంటే ఉద్యమం తప్పదు!

ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని లిఫ్ట్ చేసి బీడువారిన భూములకు మళ్లించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Epaper: epaper.vaartha.com

షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య.. మృతదేహం తీసుకునేందుకు కుటుంబం నిరాకరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha