Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కాళిదాస్ 2'( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

'కాళిదాస్ 2'( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

వార్త 1 week ago

Kalidas 2 Movie: భరత్ హీరోగా 2019లో వచ్చిన 'కాళిదాస్' తమిళంలో ఘనవిజయం సాధించి ఆయన క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఆ విజయానికి కొనసాగింపుగా, అదే దర్శకుడు సెంథిల్ తెరకెక్కించిన సీక్వెల్ 'కాళిదాస్ 2' ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది.

ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చి సస్పెన్స్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

Read Also: Memu Cop-lam Web Series: మే 22న జీ5లో 'మేము కాప్ లం' సందడి.. ట్రైలర్ చూశారా?

 Kalidas 2.. A suspenseful crime thriller

Kalidas 2 Movie: కథ

సుమారు 500 కుటుంబాలు నివసించే ఒక భారీ గేటెడ్ కమ్యూనిటీలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఆ సంబరాల మధ్యే గోకుల్ – సంజన దంపతుల మూడున్నరేళ్ల కుమార్తె ‘మిత్ర’ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ కాళిదాస్ (భరత్) రంగంలోకి దిగుతాడు. అదే కమ్యూనిటీలో ఉండే రూప (సంగీత మాధవన్ నాయర్) పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌లో సహకరిస్తుంది. అయితే కొద్దిసేపటికే పాప మిత్ర శవమై కనిపించడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరుగుతుంది.

కేసు విచారణలో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ వైష్ణవి (భవానిశ్రీ) కూడా తోడవుతుంది. అనుమానాలన్నీ గతంలో నేర చరిత్ర ఉన్న స్టీఫెన్ (అజయ్ కార్తీ) వైపు మొగ్గుతాయి. స్టీఫెన్‌కు ‘మర్ఫీ’ అనే నేరస్థుల ముఠాతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తారు. అయితే, ఒక ప్రముఖ లాయర్ నటరాజన్ (ప్రకాశ్ రాజ్) ఎంట్రీ ఇచ్చి స్టీఫెన్ నిర్దోషి అని వాదించడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. అసలు మిత్రను చంపింది ఎవరు? మర్ఫీ ముఠా వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ

దర్శకుడు సెంథిల్ ఒక చిన్న పాయింట్‌ను తీసుకుని, దానికి రకరకాల ముడులు వేస్తూ కథను నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో తిరిగే కథ కావడంతో ప్రతి పాత్రపై ప్రేక్షకులకు అనుమానం కలిగేలా స్క్రీన్ ప్లే అల్లారు. ఒక నేరానికి, మరో నేరానికి ఉన్న సంబంధాన్ని రివీల్ చేసే వరకు సస్పెన్స్‌ను కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించారు. ముగింపులో వచ్చే ట్విస్టులు ఊహాతీతంగా ఉండి థ్రిల్ కలిగిస్తాయి.

నటీనటుల ప్రదర్శన

కాళిదాస్ పాత్రలో భరత్ మరోసారి పరిణతి చెందిన నటనను కనబరిచారు. చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన సంగీత మాధవన్ నాయర్ తన నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రకాశ్ రాజ్ పాత్ర చిన్నదైనా కథలో కీలకంగా ఉంటుంది. సాంకేతికంగా చూస్తే.. సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. సురేశ్ బాల కెమెరా పనితనం థ్రిల్లర్ ఎఫెక్ట్‌ను బాగా పండించింది.

ముగింపు

ఫలానావారే నేరం చేశారని ముందుగానే మైండులో ఫిక్స్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. ఇన్వెస్టిగేషన్ పూర్తికాకముందే ఒక నిర్ధారణకు రాకూడదు. పోలీస్ అధికారుల మధ్య ఉండే ఇగో ఫీలింగ్స్ కారణంగా కూడా ఒక్కోసారి ఆధారాలు జారిపోతూ ఉంటాయి .. అసలైన నేరస్థులు తప్పించుకుంటూ ఉంటారు అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

దర్శకుడిగా రామ్ పోతినేని: 'RAPO23' స్పెషల్ అప్‌డేట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha