Vizianagaram Crime: విజయనగరం జిల్లాలో తీరని విషాదం నెలకొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జిల్లా వాసి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు.
మృతుడు బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాయి శ్రీహరి కృష్ణగా గుర్తించారు. ఉద్యోగ రీత్యా కాలిఫోర్నియాలో స్థిరపడిన ఆయన, చిన్న వయసులోనే మరణించడం స్థానికంగా అందరినీ కలిచివేస్తోంది.
Read Also: US-Iran Peace Talks: షరతులకు నో చెప్పిన టెహ్రాన్.. జేడీ వాన్స్ హెచ్చరిక!
California Waterfalls Accident
Vizianagaram Crime: బర్త్ డే పార్టీలో విషాదం
జన్మదిన వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు కాలిఫోర్నియాలోని ఓ జలపాతం వద్దకు వెళ్లాడు. నీటిలోకి దిగి ఈత కొడుతుండగా ప్రవాహం మధ్యలో సుడిగుండం ఏర్పడింది.సుడిగుండంలో పడి సాయి శ్రీహరికృష్ణ కొట్టుకుపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.సాయి శ్రీహరి కృష్ణ మృతితో పిరిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
తిరుమలలో భక్తుల రికార్డు: శ్రీవారి సన్నిధిలో పెరిగిన దర్శనాలు

