Dailyhunt
కాలుష్య కాసారమే!

కాలుష్య కాసారమే!

వార్త 2 weeks ago

Pollution : ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఎందుకో ఈ దేశాన్ని కాలుష్యకాసారాలు పట్టిపీడిస్తు న్నా యి. పరిశ్రమలు నగరీకరణ, వాహ నాలు పెరుగుదల వీటన్నిటినీ చూసి అభివృద్ధి జరుగుతోంది కదా!

అని ఎంత సంబరపడినా నానాటికీ తీవ్ర మౌతున్న కాలుష్యస్థాయిలో ప్రపంచాన్ని సైతం భయ పెడుతున్నాయి. గాలి, నీరు, నేల వంటి ప్రకృతి వనరులు హానికర పదార్థాల కారణంగా కలుషితమవుతున్నాయి. అవి ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని ప్రభావితం చేస్తున్న విషయం విదితమే. ప్రపంచస్థాయిలో కాలుష్య రీత్యా ర్యాంకులు నిర్ణయిస్తే భారతదేశం టాప్ 25 నగరాల్లో ఉంది. భారతదేశంలో అందులోనూ ఉత్తరప్రదేశ్లో కనీసం నాలుగు నగరాలు పారిశ్రామిక కాలుష్యంలో చిక్కుకున్నా యి. ఉత్తరం భారతదేశంలోని నగరాలు గాలి కాలుష్యం తో ముందుంటాయి. ఆ ప్రాంతంలోని చిన్న పట్టణాలు సైతం అతివేగంగా కాలుష్య సమస్యలో చిక్కుకుంటు న్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ఎప్పుడూ వాతావరణ కాలుష్యంతోనే ఉంటుందని తెలిసిందే. అందువల్లనే అక్కడ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేకపో తున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడం మాని ‘వర్క్షామ్ హోం’ చేస్తున్నారు. ఈ పరిస్థితులను దాటి రావాలంటే ఢిల్లీ కాలుష్యానికి బ్రేక్ పడాలి. అలాంటి పరిస్థితులు కనుచూపుమేరలో కనపడటం లేదు. కాలుష్య నియంత్రణ మండలికి కానీ పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులకు సైతం మింగుడుపడని వ్యవహారంగా కనపడుతోంది. వారి ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.

Read Also : EV Models : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఈవీ సంస్థలు

 Failure to implement air quality standards

అత్యంత కాలుష్య పట్టణం

ఢిల్లీలో (Delhi)వాయుకాలు ష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 400 స్థాయికి పైగా నమోదై రెడ్జోన్లోకి వెళ్లి చాలా రోజులైంది. ఏటా స్విట్జర్ లాండకు చెందిన వాయు నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఇచ్చే ‘ఐక్యూ ఎయిర్’ 2025 వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణంగా ఉత్తరప్రదేశ్లోని ‘లోని’ పట్టణం నిలిచింది. అంతకన్నా ఎక్కువ కాలుష్యం మన దాయాది దేశం పాకిస్థాన్ అని ఐక్యూ ఎయిర్ స్విస్ వాయు నాణ్యత సాంకేతిక సంస్థ విడుదల చేసిన 2025 ప్రపంచ వాయు కాలుష్య నాణ్యతా నివేదికలో పేర్కొంది. అలా అని భారత్లో కాలుష్యకాసారాలు ఏమీ తక్కువ కాదు. భారతీయ నగరాల్లో వేగంగా పెరుగుతున్న జనాభాయేకాదు కాలుష్య కాసారాలు కూడా గణించదగిన స్థానంలోనే ఉన్నాయి. ఈశాన్య భారతదేశంలో బైర్ని హాట్, ఢిల్లీ, పంజాబ్లోని ముల్లాన్పూర్, ఉలాలు కూడా అంతే సాంద్రతతో కాలుష్యం వ్యాపింప చేసే నగరాలుగా గుర్తించారు. ప్రపంచంలోని 143 దేశాల్లోని 9446 నగరాల్లోని పరిస్థితులను విశ్లేషించిన ఈ సంస్థ పలు అంశాలను చర్చించింది.

భారత్లోని ఐదు నగరాలు

ఈ నేపథ్యంలో దక్షిణాసి యా దేశాల్లో అత్యధిక కాలుష్య నగరాలున్నాయి. ‘లోని’ పట్టణ సగటు పి.ఎం 2.5 గాఢతను, ఒక క్యూబిక్ మీటర్కు 112.5గ్రా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కన్నా 22 రెట్లు ఎక్కువ. 130 దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు నాణ్యతా ప్రమాణాల అమలులో విఫలమయ్యాయి. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది. పాకిస్థాన్ ప్రథమ స్థాయిలో ఉండి గాలి నాణ్యత అత్యంత ప్రమాద కరంగా ఉండ డంతో ఆరోగ్య రీత్యా పాకిస్థానీయులు ఉక్కిరిబిక్కిరవుతు న్నారు. ఆ తర్వాత స్థానాల్లో బంగ్లా దేశ్, తజికిస్థాన్ ఉన్నాయి. చైనాలోని హోటాన్ నగరం లో 109.6 మైకో గ్రాములు నమోదైంది. భారత్లోని కనీసం ఐదు నగరా లు మొదటి పది కాలుష్య నగరాల జాబితాలో ఉండడం ఆందోళనకరం. టాప్ 25 నగరాలన్నీ భారత్, పాక్, చైనా దేశాల్లోనే ఉన్నాయని మరో పరిశీలన కూడా ఈ నివేదికలో స్పష్టమౌతోంది. ప్రపంచ నగరాల్లో 14 శాతం మాత్రమే డబ్ల్యుహెచ్ఓ నిర్దేశిత వార్షిక పిఎం ప్రమాణాలను చేరుకోగలిగాయని నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియా, ఐస్లాండ్, ఎస్టోనియా, పనామా సహా 13 దేశాలు మాత్రమే సురక్షిత గాలి ప్రమాణాలతో ఉన్నట్లు ఈసంస్థ చెబుతోంది. మరోవైపు లావోస్, కంబోడియా, ఇండోనేషి యా వంటి దేశాల్లో ‘లానినా వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు, గాలులు ఎక్కువగా ఉండడంతో గత ఏడాదితో పోలిస్తే పిఎం 2.5 స్థాయిలు తగ్గాయి. మొత్తం 75 దేశాల్లో కాలుష్య స్థాయిలు తగ్గగా, 54 దేశాల్లో పెరిగాయి.

 India is in sixth place. Pakistan is in first place.

ఎలక్ట్రానిక్ వాహనాల

గతంలో నుండే పాకిస్థాన్ కాలుష్యదేశాల జబితాలో ఉంది కనుక చెప్పేదేం లేదు. పొగమంచు పారిశ్రామిక ఉద్గారాలతో తీవ్ర వాయు కాలుష్య సంక్షోభాన్ని ఎదు ర్కొనే నగరాలు ఉత్తరభారతంలో కన్పిస్తాయి. దక్షిణ భారతంలోకి వస్తే హైదరాబాద్లో కూడా వాయు కాలు ష్య సమస్యతో జనం బిత్తరపోతున్నారు. మొన్నఫిబ్రవరి నుండే వాయుకాలుష్య సంక్షోభంలో పడింది. క్షీణిస్తున్నగాలి నాణ్యత కారణంగా శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఉంటుంది. ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులు కూడా వెంట వస్తాయి. కాలుష్యం ఏ రీతిలో ఉన్నా రోగనిరోధక శక్తి తగ్గి రోగాలు మానవ దేహంపై దాడి చేస్తుంటాయి. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం తెలిసి మరీ ప్రవర్తించాలి. కాలుష్య సమస్యను తగ్గించడం కోసం ప్రభుత్వం ప్రస్తుతమున్న వాహనాల స్థానే ఎలక్ట్రానిక్ వాహనాలను కొనమని సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్యం వెదజల్లే పాతబడిన వాహనాలనువినియోగం నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. పునరుత్పాదక శక్తి వినియోగకంపై జనంలో అవగాహన పెంచడం అత్యంతావశ్యకం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha