పంజాబ్ రాష్ట్రంలో గత ఆరు రోజులుగా తీవ్ర కలకలం రేపిన ప్రముఖ మహిళా సింగర్ ఇందర్ కౌర్ కిడ్నాప్ ఉదంతం చివరకు విషాదాంతమైంది. ఆరు రోజుల క్రితం అపహరణకు గురైన ఆమె..
చివరకు ఒక కాలువలో శవమై తేలారు. స్థానిక కుబా గ్రామ సమీపంలోని నీలోన్ కాలువలో కొట్టుకువచ్చిన ఆమె మృతదేహాన్ని పోలీసులు ఈరోజు గుర్తించారు. గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందర్ కౌర్ ఇలా అకాల మరణం చెందడంతో పంజాబీ సంగీత పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Read Also : ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన 'కరుప్పు' టీమ్

పాత కక్షలే కారణం - మాజీ ప్రియుడి ఘాతుకం
ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ప్రాథమిక విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇందర్ కౌర్ మాజీ ప్రియుడు సుఖ్వీందర్ సింగే ఈ కిడ్నాప్, హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అయితే మనస్పర్థల కారణంగా కొన్నాళ్ల క్రితం విడిపోయారని సమాచారం. ఈ బ్రేకప్‌ను తట్టుకోలేక, ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్న సుఖ్వీందర్.. ఎలాగైనా ఇందర్ కౌర్‌ను మట్టుబెట్టాలని పథకం పన్నినట్లు విచారణలో తేలింది.
కెనడా నుండి వచ్చి మరీ స్కెచ్ - నేపాల్ మీదుగా ఎంట్రీ
ఈ దారుణానికి ఒడిగట్టేందుకు నిందితుడు సుఖ్వీందర్ సింగ్ అత్యంత పక్కాగా వ్యూహం రచించాడు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న అతడు.. ఇందర్ కౌర్‌ను హతమార్చడమే లక్ష్యంగా గత నెలలోనే విదేశం నుండి ప్లాన్ చేసుకుని బయలుదేరాడు. నేరుగా వస్తే పోలీసులకు దొరికిపోతాననే భయంతో కెనడా నుండి నేపాల్ చేరుకుని, అక్కడ నుండి సరిహద్దుల ద్వారా రహస్యంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. పంజాబ్ చేరుకున్న తర్వాత సమయం కోసం వేచి చూసి, ఆరు రోజుల క్రితం ఆమెను కిడ్నాప్ చేసి, ఆపై దారుణంగా హత్య చేసి శవాన్ని కాలువలో పారేసాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఆ సీన్స్ చేయలేక ఏడ్చేసిన త్రిష.. ప్రభాస్ హిట్ సినిమా వెనుక ఇంత కథ ఉందా!

