Laxman Sivarama Krishnan: క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు కామెంటేటర్లు చెప్పే మాటలు మనకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అయితే, ఆ మైక్ వెనుక కామెంటరీ బాక్స్‌లో స్వేచ్ఛ లేదని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాము అనుకున్నది స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం అక్కడ ఉండదని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది అభిమానులు కామెంటేటర్లు అద్భుతంగా మాట్లాడుతున్నారని అనుకుంటారు, కానీ అక్కడ పరిస్థితి నరకంలా ఉంటుందని ఆయన వివరించారు.
Read also: Vaibhav Suryavanshi RR: సార్, మీరేం టెన్షన్ పడకండి.. నేను గెలిపిస్తా!
Sivaramakrishnan on commentary box
ముందే రాసిపెట్టిన గైడ్‌లైన్స్
లైవ్ మ్యాచ్ మొదలవ్వక ముందే బ్రాడ్‌కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు ప్రత్యేకమైన గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేస్తారు. ఫలానా ఆటగాడిని విమర్శించవద్దు, పిచ్ గురించి నెగెటివ్‌గా మాట్లాడవద్దని ముందే ఆదేశాలు జారీ చేస్తారు. దీనివల్ల కామెంటేటర్లు సొంత అభిప్రాయాలను చెప్పలేక, వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే చదవాల్సి వస్తోంది. నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దామంటే, భవిష్యత్తులో కాంట్రాక్టులు ఉండవనే హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వాపోయారు.
Laxman Sivarama Krishnan: డబ్బు, కెరీర్ కోసం నోరు నొక్కేయడం
టీ20 లీగ్స్, ద్వైపాక్షిక సిరీస్‌లలో ఈ నియంత్రణలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆరోపించారు. కేవలం తమ కెరీర్ కాపాడుకోవడానికి, డబ్బు కోసం చాలా మంది బ్రాడ్‌కాస్టర్లు చెప్పినట్లు వినాల్సి వస్తోంది. ఆటలోని లోపాలను ఎత్తిచూపలేక, బలవంతంగా తలలూపుతూ కామెంటరీ చేయాల్సి రావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. క్రీడల పట్ల ప్యాషన్‌తో ఉండేవారికి ఇటువంటి నియంత్రణలు తీవ్రమైన ఆటంకంగా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. కోహ్లీకి కూడా దక్కని రికార్డ్!

