BRS Protests: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు మరియు ఇచ్చిన హామీల అమలు తీరును నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి వారం రోజుల పాటు ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

హైదరాబాద్‌లో కేటీఆర్ చేతుల మీదుగా కాంగ్రెస్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల
ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాజధాని హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై అధికారికంగా ‘ఛార్జ్ షీట్’ (Charge Sheet) విడుదల చేయనున్నారు. గత వెయ్యి రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఏమేం చేయడంలో విఫలమైందో ఆ పత్రం ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
BRS Protests: ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై ధర్నాలు మరియు బాకీ కార్డుల పంపిణీ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మరియు ఇతర హామీల అమలులో జరుగుతున్న అలసత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ కీలక వ్యూహం రచించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నారు. అలాగే, ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు, ప్రజలకు ప్రభుత్వం బాకీ పడిన హామీలను గుర్తుచేస్తూ వినూత్న రీతిలో ‘బాకీ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

