Telangana : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనబెట్టి రాజకీయ వీధి నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ బీజేపీ నేత రాంచందర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేవలం పబ్లిసిటీ మరియు రాజకీయ ప్రయోజనాల కోసమే ఇరు పార్టీలు సవాల్లు, ప్రతిసవాల్లతో స్టంట్లు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో అరాచకాలు, అవినీతి రాజ్యమేలగా, నేటి కాంగ్రెస్ పాలనలోనూ అదే తరహా పాలనా వైఫల్యాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజాక్షేమాన్ని విస్మరించి, నిత్యం విమర్శలతో కాలయాపన చేస్తున్న ఈ రెండు పార్టీల తీరును చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలి: రాంచందర్రావు డిమాండ్!
రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, అలాగే భూముల 22A నిషేధిత జాబితా చిక్కులు వంటి అనేక ముఖ్యమైన అంశాలపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని రాంచందర్రావు స్పష్టం చేశారు. ఈ కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించకుండా, ఉద్దేశపూర్వకంగా సభ సమయాన్ని వృథా చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయ స్వార్థాన్ని వీడి, అసెంబ్లీలో ప్రజలను వేధిస్తున్న సమస్యలపై సమగ్రమైన చర్చ చేపట్టి తగిన పరిష్కారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
అయ్యో.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి

