Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు చూస్తే బిగ్ బాస్ షో చూస్తున్నట్టుంది: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు చూస్తే బిగ్ బాస్ షో చూస్తున్నట్టుంది: బండి సంజయ్

వార్త 2 days ago

Bandi Sanjay: తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర అప్పులు, గురుకుల టెండర్లలో అవకతవకల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య చెలరేగిన సవాళ్లు, ప్రతిసవాళ్లు హైడ్రామాకు దారితీశాయి.

బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును స్వీకరించి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వైపు దూసుకెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ‘డబుల్ ఎలిమినేషన్’ తప్పదు!

ఈ రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నడుస్తున్న ఈ సవాళ్ల పర్వం అంతా ఒక ‘బిగ్ బాస్’ రియాలిటీ షోను తలపిస్తోందని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. బయటకు మాత్రం ఇరు పార్టీలు కొట్టుకుంటున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం రహస్యంగా కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.

Bandi Sanjay: బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చకు పిలుపు

ఈ రెండు పార్టీల వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ సిద్ధమవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన అవినీతి, రాష్ట్ర అప్పుల గుట్టలు, పాలనా పరమైన లోపాలపై తామే స్వయంగా ఒక బహిరంగ చర్చను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి (ఎన్. రామచందర్ రావుకు) ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఎంతగా సహకరిస్తుందో కూడా ఈ సందర్భంగా ప్రజలకు వివరిద్దామన్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు ‘డబుల్ ఎలిమినేషన్’ చేయడం ఖాయమని, తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం వస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

Epaper: epaper.vaartha.com

చర్చకు మేం సిద్ధం.. వెనక్కి తగ్గింది కాంగ్రెస్ మంత్రులే: కేటీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha