TG Minimum Wages: తెలంగాణ రాష్ట్రంలోని కోట్ల మంది కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల (Minimum Wages) సవరణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. పెంచిన నూతన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Read Also: Medak Fire Accident: మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..
మూడు జోన్లుగా విభజన.. కేటగిరీల వారీగా వేతనాల పెంపు ఇలా
కార్మికుల వేతనాలను హేతుబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా (జోన్-1: మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2: మున్సిపాలిటీలు, జోన్-3: గ్రామీణ ప్రాంతాలు) విభజించింది. అత్యధిక ఉపాధి ఉండే జోన్-1 పరిధిలోని పెరిగిన వేతనాల వివరాలు:అన్‌స్కిల్డ్ (Unskilled) కార్మికులు: రూ. 12,750 నుండి రూ. 16,000 కు పెంపు, సెమీ స్కిల్డ్ (Semi-Skilled) కార్మికులు: రూ. 13,592 నుండి రూ. 17,000 కు పెంపు, స్కిల్డ్ (Skilled) కార్మికులు: రూ. 13,772 నుండి రూ. 18,500 కు పెంపు, హై స్కిల్డ్ (High-Skilled) కార్మికులు: రూ. 14,607 నుండి రూ. 20,000 కు పెంపు
TG Minimum Wages: గత ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం రేవంత్, మంత్రి వివేక్ విమర్శలు
TG CM: CM Revanth Reddy’s bumper gift to workers
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాల సవరణ చేయకపోవడం వల్ల కోటి మందికి పైగా కార్మికులు తీవ్రంగా నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరియు మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కార్మికులు ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే పరిశ్రమలలో ఉత్పత్తి, నాణ్యత బాగుంటుందని, అందుకే తమ ప్రభుత్వం ఈ వేతనాల పెంపునకు శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఉపాధి అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ భద్రత: ఏఐ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలకే ముప్పు ఉంటుందని, క్షేత్రస్థాయిలో పనిచేసే బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో నైపుణ్యం గల కార్మికులకు భారీ డిమాండ్ ఉందని, విదేశాల్లో రూ. 2 లక్షల వరకు వేతనం పొందేలా రాష్ట్ర యువత స్కిల్స్ పెంచుకోవాలని పిలుపునిచ్చారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను ఏటీసీ (ATC) విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ. 2,000 స్టైపెండ్ అందిస్తోందని సీఎం గుర్తుచేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

