Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కారులో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య

కారులో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య

వార్త 3 weeks ago

Medchal Malkajgiri Suicide: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. కార్తీక్ (40) అనే వ్యక్తి కారులో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో సజీవదహనమయ్యాడు.

ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న స్థానికులు చూస్తుండగానే కారులో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. లోపల ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించే లోపే మంటలు తీవ్రరూపం దాల్చడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: Man Kills Wife In Guwahati : దారుణం.. భార్యను చంపి, ఫ్రిజ్‌లో తలను దాచిన భర్త

 Man burns to death after dousing himself with petrol in car.

Medchal Malkajgiri Suicide: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు

మృతుడు కార్తీక్ స్థానికంగా లాండ్రీ వ్యాపారం చేస్తూ తల్లితో కలిసి నివసిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు, గొడవలు జరుగుతుండటంతో భార్య, పిల్లలు గత రెండేళ్లుగా ఆయనకు వేరుగా ఉంటున్నారు. ఒకవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Epaper: epaper.vaartha.com

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూట్యూబర్ నందన అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha