Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కావ్య మారన్ వివాహ వేడుకకు కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక

కావ్య మారన్ వివాహ వేడుకకు కేటీఆర్‌కు ఆహ్వాన పత్రిక

వార్త 1 week ago

Anirudh-Kavya Maran Wedding: టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్యా మారన్ వివాహ రిసెప్షన్‌కు ముహూర్తం ఖరారైంది.

వచ్చే నెల నవంబర్ 21వ తేదీన చెన్నై వేదికగా ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు మరియు ప్రముఖులను ఆహ్వానించే పనులు జోరుగా సాగుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లకు ప్రత్యేక ఆహ్వానం

సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. తొలుత జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి, తమ కుమార్తె కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్‌ల రిసెప్షన్‌కు రావాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో అధికారికంగా ధ్రువీకరించింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమలను కలిసి రిసెప్షన్ ఆహ్వాన పత్రికను అందజేయగా, కేటీఆర్ నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

Anirudh-Kavya Maran Wedding: సోషల్ మీడియా రూమర్స్‌కు చెక్ పెట్టిన మారన్ కుటుంబం

అనిరుధ్ మరియు కావ్యా మారన్ ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించి గతంలో నెట్టింట అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఈ వార్తలను అనిరుధ్ ఖండించడం, అలాగే మరో ప్రముఖుడితో కావ్య పెళ్లి అంటూ ప్రచారాలు జరగడం జరిగాయి. అయితే, మారన్ కుటుంబం స్వయంగా ప్రముఖులను వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించడంతో ఈ రూమర్స్ అన్నింటికీ అధికారికంగా తెరపడినట్టయింది.

గ్రీస్‌లో పెళ్లిపై ఇంకా స్పష్టత రాని వైనం

రిసెప్షన్ తేదీని అధికారికంగా ఖరారు చేసినప్పటికీ, వివాహం జరిగే తేదీ మరియు వేదికపై మాత్రం ఇరు కుటుంబాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే నవంబర్ 10 లేదా 11వ తేదీన గ్రీస్ దేశంలో వీరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సినీ, క్రీడా, రాజకీయ మరియు వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరుకానున్న ఈ వేడుకపై సర్వత్రా భారీ ఆసక్తి నెలకొంది.

Epaper: epaper.vaartha.com

6వ వారం ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha