Adani Power Project: ఆంధ్రప్రదేశ్లో భారీ ఇంధన ప్రాజెక్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వైఎస్ఆర్ కడవ జిల్లాలో 2,250 మెగావాట్ల సామర్థంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును (పిఎస్పీ) అభివృద్ధి చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన ఆదానీ హైడ్రో ఎనర్జీ ఎలెవెన్ లిమిటెడ్క రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపిబి) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
గండికోట2
‘గండికోట2’ పేరుతో వైఎస్ఆర్ కడప జిల్లాలోని లార్డ్ బాలాజీ దొంతికోన పిఎస్పీ పార్కులో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే అతిపెద్ద వంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పెరుగుతున్న గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ (mobility), డేటా సెంటర్ల వంటి అధునాతన పరిశ్రమలకు అవసరమైన నిరంతరాయ విద్యుత్ను అందించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.
పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధన వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు ఆ మిగులు విద్యుత్తో నీటిని పైకి పంపింగ్ చేసి, డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఆ నీటిని కిందకు వదిలి టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల 24 గంటలూ నిరంతరాయంగా స్వచ్ఛమైన విద్యుత్ను అందించడం సాధ్యమవు తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఉన్న గండికోట జలాశయం నుంచి ఒకేసారి నింపడానికి 29.20 ఎంసిఎం నీటిని, ఏటా ఆవిరి నష్టాల కోసం 2.20 ఎంసిఎం నీటిని కేటాయించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
The country’s largest Adani project in Kadapa… Coalition government gives green signal!
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024
ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024’ కింద ఈ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఈ పాలసీ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును 72 నెలల్లో (6 ఏళ్లు) పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. విధానపరమైన స్థిరత్వం, వేగవంతమైన అనుమతుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ప్రభుత్వం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
Adani Power Project: రిలయన్స్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారీ పెట్టుబడికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలిపల్లి, భోగాపురం పరిధిలో 853.97 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెంటరు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన ఎపి ప్రభుత్వం.. వాటికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. విజయనగరం జిల్లాలో గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆర్ఎల్ ముందుకొచ్చింది. రూ.1,08,010 కోట్ల భారీ అంచనా వ్యయంతో డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఆరఐఎల్ ప్రతిపాదనలు చేసింది.
డేటా సెంటర్ ప్రోత్సాహకాలు
దీనికి, అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. డేటా సెంటర్ కోసం 853.97 ఎకరాల భూమిని తాజాగా కేటాయించింది. ప్రాజెక్టు కోసం సేకరించే భూమి విలువపై రిలయన్స్ సంస్థకు 25 శాతం రాయితీ ఇస్తోంది. అలాగే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు మరో ఎకరం భూమిని ప్రత్యేకంగా కేటాయించింది. డేటా సెంటర్ కోసం విద్యుత్ గ్రిడ్ మౌలిక సదుపాయాలు, 20 ఏళ్ల పాటు నీటి సరఫరా గ్యారెంటీని ప్రభుత్వం కల్పించనుంది. ప్రాజెక్టుకు 100 శాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు.. మెషినరీపై 6 శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
10 ఏళ్ల పాటు నిర్మాణరంగం, లీజింగ్ ఖర్చులపైనా 100శాతం నెట్ రీయింబర్స్ మెంట్ చేయనుంది. యూనిట్ విద్యుత్పై రూ.1 చొప్పున 15 ఏళ్ల పాటు రాయితీ.. నీటి పన్నుపై 10 ఏళ్ల పాటు 15 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.5 వేల కోట్ల పరిమితితో 20 ఏళ్ల పాటు ట్రాన్స్ మిషన్/వీలింగ్ ఛార్జీల నుంచి 100 శాతం మినహాయింపు ఇచ్చేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రాజెక్టుకు సింగిల్ విండో క్లియరెన్స్ సదుపాయం కల్పిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

