Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కలవరపెడుతున్న ఎల్నినో

కలవరపెడుతున్న ఎల్నినో

వార్త 6 days ago

Vaartha Sanghibavam: ఈసారి వర్షాభావంతో కరవు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి.

సామాన్యుడి జీవనంపై అధిక ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వస్తున్న మార్పులు మరిన్ని సమస్యలను కొనితెచ్చేలా ఉన్నాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణోగ్రత ప్రభావం వల్ల ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం తప్పనిసరిగా భారతదేశంలో రుతుపవనాలపై చూపించే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రెండు నుంచి ఏడేళ్ల కాలంలో ఎల్న్ని పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టమౌతోంది. ఈ పరిస్థితులు జూన్కు ముందు నుంచే ఏర్పడితే కొంత ప్రభావం తగ్గి సకాలంలో రుతుపవనాలు వచ్చి వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి మే చివరి వారం గాని, జూన్ మొదటి వారంలో గాని ఈ పరిస్థితులు రావడం వల్ల రుతువవనాలపై స్పష్టమైన ప్రభావం కనిపించే ప్రమాదం ఉందని తెలుస్తోంది. సూపర్ ఎల్నినో వల్ల వర్షాలు గణనీయంగా తగ్గి కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావారణ నిపుణులు తెలుపుతున్నారు, గతంలో సంభవించిన ఎల్నినోల చరిత్ర పరిశీలిస్తే.. తీవ్రత తొమ్మిది నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది.

మధ్య, తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో 2016లో బలమైన ఎల్నినో ఏర్పడింది. పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంటున్న ఉష్ణోగ్రతల మార్పులు ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా భారతదేశాన్ని కలవరపెడుతు న్నాయి. వాతావరణ పరిస్థితులు వేగంగా ఎలినినో దిశగా మారుతున్నాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత్కు చెందిన ఇన్కాయిస్ తాజా బులెటిన్లో హెచ్చరించింది. వేసవికాలం తర్వాత ఇండియన్ సమ్మర్ మాన్సూన్ ప్రారంభమవుతుంది. దీనికి వేసవిలో వేడిమే కారణం. ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వేడి ఉండటం వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. అలాగే దక్షిణ భారతదేశం దాటి భూమధ్య రేఖకు అవతల ఉన్న ఉన్న ప్రాంతానికి శీతాకాలం ఏర్పడుతుంది. మస్కారన్ ఐలాండ్స్ అనే ప్రాంతంలో భూమధ్యరేఖకు దిగువగా బలమైన అధిక పీడన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అధిక పీడనం నుంచి ఉత్తర భారత్లోని అల్పపీడన ప్రాంతం వైపు గాలుల ప్రవాహం ఉంటుంది. పసిపిక్, హిందూ మహాసముద్రం, బంగాళఖాతం మీదుగా వేడిగాలులు ప్రయాణం చేసి రావడం వల్ల చాలా తేమను తీసుకువచ్చి నాలుగు నెలల పాటు భారత భూభాగంలో వర్షాలు పడుతుంటాయి. అయితే రుతుపవనాలపై ప్రభావం చూపించే రెండు వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జలాల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీలు పెరిగినా అది రుతు పవనాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం తర్వాత ఆ పవనాలు హిందూ మహా సముద్రం మీదుగా వస్తాయి.

Vaartha Sanghibavam: దీనిని ఇండియన్ ఓషియన్ డైపోల్ (ఐవోడీ) అని చెబుతారు. తూర్పు వైపు వేడిగా ఉండి, పశ్చిమ వైపు చల్లగా ఉన్నప్పుడు నెగిటివ్ ఐవోడీ అంటారు. దీనివల్ల రుతుపవనానాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశ్చిమాన వేడి జలాలు ఉండి, తూర్పులో చల్లని జలాలు ఉన్నట్లయితే దానిని పాజిటివ్ ఐవోడీగా పిలుస్తుంటారు. దీనివల్ల ఎల్నినో ప్రభావం తటస్థం చేసి రుతుపవనాలు సాధారణంగా ఉంటాయి. ప్రస్తుతం ఎల్సినో ఐవోడీ తటస్థంగా ఉన్నప్పటికీ మే చివరి నాటికి ఇది ఎల్నినోగా మారొచ్చని ఐఎండీ అంచనా వేస్తుంది. సాధారణంగా మన ప్రాంతంలో జూన్-సెప్టెంబరు వరకు రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఏ నెలలో అయినా ఎన్నినో, నెగిటివ్ ఐవోడీ పరిస్థితులు ఏర్పడితే వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మొదటి నుంచి ఎల్ నినోగా కొనసాగుతుంటే రుతుపవనాలు ఆలస్యమవ్వొచ్చు. అనుకున్న సమయానికి వర్షాలు పడకపోవడం లాంటి పరిస్థితులు ఉంటాయి. తెలంగాణలో జులై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా వర్షం పడుతుంది. ఎల్సినో ప్రభావం ఉన్నట్లయితే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఒక్కోసారి జూన్లో భారీ వర్షాలు పడి, జులై అంతా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఉత్తర భారతంలో ఏర్పడే ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాల నుంచి బంగా ళాఖాతం మీదుగా వేడిగాలులు ప్రయాణం చేస్తే వచ్చే తేమ కారణంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఏదిఏమైనా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఎట్టకేలకు రాజధాని ఏర్పాటు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha