Siddipet Library: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దరిపల్లి చంద్రం గురువారం జిల్లా కలెక్టర్ కే. హైమావతిని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు కల్పించాల్సిన సౌకర్యాలు మరియు విద్యార్థులకు ఉపయోగపడేలా గ్రంథాలయాలను మరింత ఆధునీకరించడంపై వారు చర్చించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దరిపల్లి చంద్రంని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందిస్తూ, గ్రంథాలయాల పురోభివృద్ధికి సహకరించాలని కోరారు. జిల్లా పౌర సంబంధాల అధికారి సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయ నైనది.
Read also: Hyderabad News: ఎల్బీనగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి ICUలో చికిత్స
Siddipet Library: విద్యార్థుల కోసం సరికొత్త సౌకర్యాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని కలెక్టర్ హైమావతి కోరారు. చదువుకునే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యా వ్యాప్తికి గ్రంథాలయాలు కీలకంగా మారాలని చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

