Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కల్కి 2'లో భైరవగా ప్రభాస్‌.. బర్త్‌డే స్పెషల్‌ వీడియో విడుదల

'కల్కి 2'లో భైరవగా ప్రభాస్‌.. బర్త్‌డే స్పెషల్‌ వీడియో విడుదల

వార్త 1 day ago

Prabhas Kalki 2: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. గ్లోబల్ హిట్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో భైరవ పాత్రతో అలరించిన ప్రభాస్, ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ('కల్కి 2') షూటింగ్‌లో బిజీ అయ్యారు.

ఆయన మళ్లీ భైరవగా సెట్స్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో ఈ విజువల్ వండర్ పార్ట్-2 కోసం వేచి చూస్తున్న సినీ ప్రియులు, అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Jailer 2 : ఆ రికార్డు సాధించడం ఒక్క రజినీకే సాధ్యం - అల్లు అర్జున్

Prabhas Kalki 2: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియో

దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రభాస్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఓ ప్రత్యేక తెరవెనుక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ లొకేషన్ డ్రెస్సింగ్, లుక్స్‌తో పాటు సినిమా కోసం మైండ్ బ్లాకింగ్ లెవెల్‌లో రూపొందిస్తున్న భారీ సెట్‌లను చూపించారు. దీంతో సీక్వెల్‌పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

కీలక పాత్రల్లో బిగ్ బి, కమల్ హాసన్

తొలి భాగంలో తన మార్క్ స్టైల్, టైమింగ్, వినోదాత్మక డైలాగులతో భైరవ పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. ఇప్పుడు రాబోయే పార్ట్-2లో కల్కి ఆగమనానికి సంబంధించిన ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా భైరవ ప్రయాణం కొనసాగుతుందని చిత్రబృందం తెలిపింది. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ విజువల్ వండర్‌లో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ తిరిగి నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచే స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha