Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కళ్యాణదుర్గంలో రక్తదాన ప్రభంజనం.. ప్రాణదాతలకు రూ. 3 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ!

కళ్యాణదుర్గంలో రక్తదాన ప్రభంజనం.. ప్రాణదాతలకు రూ. 3 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ!

వార్త 2 months ago

సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలలో రక్తదానంతో ప్రాణదాతలు కావాలని పిలుపు

నియోజకవర్గ ఇన్చార్జ్ టిడిపి యువ నేత దేవినేని ధర్మతేజ నేతృత్వంలో గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు

Kalyandurgam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీ స్థాయిలో రక్తదాన యజ్ఞం నిర్వహించేం దుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సమాజ సేవకు నిదర్శనంగా నిలిచేలా ప్రణాళికలు రూపొందించారు. జన్మదిన వేడుకలను కేవలం ఆర్భాటంగా కాకుండా, ప్రాణాపాయంలో ఉన్న రోగులకు ప్రాణదానం చేసే మహత్తర లక్ష్యంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Read Also:AP high court : వైసీపీ నేత శ్రీహరికి షాక్.. రిమాండ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Kalyandurgam: రక్తదాతలకు బంపర్ ఆఫర్లు

సేకరించిన రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వంటి ప్రముఖ ఆరోగ్య సంస్థలకు అందజేసి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మహాయజ్ఞాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్, టీడీపీ యువ నాయకుడు ధర్మతేజ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆయన గ్రామ గ్రామాన తిరుగుతూ పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేయడంతో పాటు, ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందిస్తున్నారు. యువత, మహిళలు, పార్టీ కేడర్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయం చేస్తున్నారు.

రక్తదాతలను ప్రోత్సహించే ఉద్దేశంతో, రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అదనంగా, సేవాభావాన్ని గుర్తిస్తూ స్టెయిన్‌లెస్ స్టీల్ కూల్ వాటర్ బాటిళ్లను బహుమతిగా అందజేయ నున్నారు. ఈ ప్రోత్సాహకాలు రక్తదాతల లో ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నా యి. ఇంతకు ముందు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు,

రికార్డుల వేటలో సురేంద్రబాబు

ఈసారి గత రికార్డులను అధిగమించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయనకు అంతర్జా తీయ స్థాయిలో గుర్తింపు లభించడం కూడా ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.మొత్తంగా, సీఎం జన్మదినాన్ని సామాజిక సేవకు మలిచే ఈ బృహత్ రక్తదాన యజ్ఞం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. "ప్రాణదాతలు కండి" అనే పిలుపుతో ప్రజలను ఆకర్షిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. ఈ యజ్ఞం ద్వారా అనేకమంది ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కళ్యాణదుర్గం తహసిల్దార్ కార్యాలయంలో అటెండర్ లక్ష్మీనరసమ్మ హఠాన్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha