Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఈ సంక్షేమ పథకాలపై వస్తున్న ఊహాగామాలకు ఆయన చెక్ పెడుతూ, ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

Ponnam Prabhakar: కోర్టు కేసు మరియు ప్రభుత్వ బలమైన వాదనలు
ఈ పథకాలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హైకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నామని ఆయన శనివారం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో సకాలంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల కోర్టు స్టే విధించిందని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే అప్రమత్తమై కౌంటర్‌తో పాటు వెకెట్ పిటిషన్ కూడా దాఖలు చేశామని వివరించారు.
న్యాయస్థానంపై ప్రభుత్వం తరఫున నమ్మకం
హైకోర్టులో ప్రభుత్వం తరఫున సమర్పించిన ఆధారాలు మరియు వినిపించిన వాదనలను న్యాయస్థానం సానుకూలంగా పరిగణలోకి తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిక్కులు తొలగిపోయి లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌కు క్షమాపణ చెప్పాల్సిందే..కొండా సురేఖకు ఎమ్మెల్యేల డిమాండ్

