Commercial Gas Cylinder Price Hike: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఊహించినట్లుగానే చమురు సెగ మొదలైంది. విపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ముందుగా హెచ్చరించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన విషయం తెలిసిందే..
Read Also:Meta CEO Zuckerberg: మరిన్ని ఉద్యోగ కోతలపై మెటా సీఈఓ జుకర్‌బర్గ్ మౌనం
ధరల బాదుడు – ముఖ్య అంశాలు
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే (Commercial) గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కరోజే దాదాపు ₹993 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తంలో ధర పెరగడం ఇదే మొదటిసారి అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సిలిండర్ ధర మొత్తం ₹1,380 పెరిగింది. అంటే కేవలం 3 నెలల్లోనే 81% పెరుగుదల నమోదైంది.
Commercial Gas Cylinder Price Hike: రాహుల్ గాంధీ స్పందన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘X’ (ట్విట్టర్) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల కోసం కేంద్రం ఆగిందని, ముగియగానే ద్రవ్యోల్బణం (Inflation) వేడి పెరుగుతుందని తాను ముందే హెచ్చరించినట్లు ఆయన గుర్తుచేశారు.ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని ఆయన “ఎన్నికల బిల్లు”గా అభివర్ణించారు.టీ స్టాల్స్, ధాబాలు, హోటళ్లు, బేకరీలు మరియు స్వీట్ షాపుల యజమానులపై ఈ భారం పడుతుందని, ఫలితంగా సామాన్యుడి భోజనం ప్లేట్ ధర కూడా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ఒపెక్ కూటమికి యూఏఈ గుడ్ బై: చమురు రాజకీయాల్లో పెను మార్పులు

