Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కంగనా రనౌత్ రహస్య పెళ్లి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం!

కంగనా రనౌత్ రహస్య పెళ్లి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం!

వార్త 2 days ago

Kangana Ranaut: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రంతో కంగనా కనిపించిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ కావడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. అయితే, ఈ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా ఒక సినిమా చిత్రీకరణలో భాగమేనని బాలీవుడ్ వర్గాల ద్వారా స్పష్టమైంది.

Read Also : Peddi Hellallallo Song Promo:పెద్ది నుంచి ఐటెం సాంగ్ ప్రోమో విడుదల

 Kangana Ranaut’s secret wedding? The real truth behind the viral video!

Kangana Ranaut: మంగళసూత్రంతో కనిపించిన కంగనా..

ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కంగనా రనౌత్‌కు సంబంధించిన ఒక తాజా వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో కంగనా సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి, మెడలో స్పష్టంగా మంగళసూత్రంతో కనిపించారు. ఈ విజువల్స్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కంగనా ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కేసిందా? అంటూ కామెంట్ల రూపంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వైరల్ వీడియోపై అటు కంగనా వైపు నుంచి గానీ, ఇటు ఆమె పీఆర్ టీమ్ నుంచి గానీ తక్షణమే ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో ఈ ప్రచారం కాస్తా మరింత ఊపందుకుంది.

కంగనా పెళ్లి వార్తలపై అసలు నిజం

కంగనా రనౌత్ మెడలో ధరించిన మంగళసూత్రం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. అది కేవలం సినిమా షూటింగ్‌లో భాగంగా ఆమె వేసుకున్న గెటప్ మాత్రమే. ‘క్వీన్ 2’ చిత్రం కోసమే ఆమె ఈ లుక్‌లో కనిపించినట్లు బాలీవుడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా ప్రారంభమైంది. అందులో భాగంగానే కంగనా ఈ కొత్త గెటప్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారని తేలింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha