Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్న కూతురిపైనే తండ్రి అఘాయిత్యం

కన్న కూతురిపైనే తండ్రి అఘాయిత్యం

వార్త 2 weeks ago

Jharkhand Koderma Crime: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి విచక్షణ మరిచాడు. మైనర్ అన్న కనికరం కూడా లేకుండా కన్న కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టిన అమానవీయ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని కొడర్మ జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

స్థానిక లోకాయ్ ప్రాంతానికి చెందిన నిందితుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన సొంత మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తల్లికి గోడు వెళ్లబోసుకున్న బాలిక - రంగంలోకి దిగిన పోలీసులు

తండ్రి చేసిన దారుణానికి తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు.. జరిగిన ఘోరాన్ని తన తల్లి వద్ద కన్నీటిపర్యంతమై వెల్లడించింది. కూతురిపై భర్త చేసిన దురాగతాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయిన తల్లి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం సహా సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Jharkhand Koderma Crime: వైద్య పరీక్షల అనంతరం నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్

ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలికి, నిందితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో, పోలీసులు అతడిని జైలుకు తరలించారు. కన్నతండ్రే ఇలాంటి పాశవిక చర్యకు పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha