Chittoor Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద అతివేగంతో వెళ్తున్న కారు, ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Terror Module Arrest in UP: యూపీలో భారీ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు
ప్రమాద వివరాలు
పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న హరీష్, యుగంధర్ ప్రయాణిస్తున్న కారు దండపల్లి క్రాస్ వద్దకు రాగానే అదుపు తప్పి ముందున్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారు అతివేగంగా ఉండటంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ క్రమంలో హరీష్, యుగంధర్‌లకు తీవ్ర గాయాలవ్వడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
Car hits container.. Two killed!
Chittoor Road Accident: క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న గంగవరం పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే శాపమా?
ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. అతివేగంతో ప్రయాణించడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి కంటైనర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తోటి ఉద్యోగుల మరణంతో తిరుపతి కోర్టు వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

