Dailyhunt
కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత కన్నుమూత

కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత కన్నుమూత

వార్త 1 week ago

Geetha Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, దివంగత జి. సాయన్న సతీమణి జి. గీత (70) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆమె మరణవార్త తెలియగానే నియోజకవర్గంలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. గీత మరణవార్త విన్న వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఆమె పార్థివదేహాన్ని అశోక్ నగర్ స్వగృహానికి తరలించారు.

Read also: Hyd Serial Romeo Arrest:హైదరాబాద్ 'సీరియల్ రోమియో' అరెస్ట్: ప్రేమ పేరుతో 10 మందికి టోకరా

 Geetha Sayanna funeral news Hyderabad

Geetha Sayanna: రాజకీయ ప్రముఖుల సంతాపం

ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, సాయన్న కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పుడు గీత మరణంతో ఆ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది. సాయన్న కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరుపొందారు. ఆయన సేవలు, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం కారణంగా స్థానికంగా మంచి గుర్తింపు పొందారు.

ఒకే కుటుంబంలో మూడు విషాదాలు

ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన ప్రజానేత జి. సాయన్న అనారోగ్యంతో 2023 ఫిబ్రవరి 19 న కన్నుమూశారు. తండ్రి మరణం తర్వాత ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన ఆయన కుమార్తె లాస్యనందిత, సరిగ్గా ఏడాది తిరగకముందే 2024 ఫిబ్రవరి 23 న ఓ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. కాగా బుధవారం నేడు సాయన్న సతీమణి, లాస్యనందిత తల్లి గీత మరణించడంతో ఆ కుటుంబంలో మరోసారి తీరని లోటు ఏర్పడింది. గీతకు మరో ఇద్దరు కుమార్తెలు నమ్రత, నివేదిత ఉన్నారు. ఒకే కుటుంబంలో కీలక వ్యక్తులు ముగ్గురు స్వల్ప వ్యవధిలోనే దూరమవ్వడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha