Traffic challan:ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెండింగ్ లో ఉన్న ఈ చలానాల జరిమానాలు చెల్లించని వాహనదారులపై సుప్రీంకోర్టు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read also: Gold rate today: పడిపోయిన పసిడి, వెండి ధరలు
Traffic challan collection via electricity bill
కరెంట్ బిల్లుల్లో చలానా బకాయిల వసూలు
పెండింగ్ లో ఉన్న ఈ చలానా బకాయిలను ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లులతో పాటు జత చేసి వసూలు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలని కోర్టు సూచించింది. దీనివల్ల బకాయిల వసూళ్లు సులువుగా మారుతాయని భావిస్తున్నారు.
Traffic challan:ఆన్ లైన్ సేవల నిలిపివేత
చలానా బకాయిలు చెల్లించని వాహనాలకు ఆర్సీ పునరుద్ధరణ, చిరునామా మార్పు, ఫిట్ నెస్ సర్టిఫికెట్ మరియు ఆన్ లైన్ సేవలను పూర్తిగా నిలిపివేయాలని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో ఆ వాహనాలను నేరుగా స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది.
Epaper: epaper.vaartha.com

