Revanth Reddy: రాష్ట్రంలో పదేపదే తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాల అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల పనితీరును తప్పుపడుతూ ఆయన నిప్పులు చెరిగారు.
ఎన్నిసార్లు హెచ్చరించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంపై మండిపడ్డారు. అధికారులు తమ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, ఉన్నతస్థాయి అధికారులనైనా సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ఉత్పత్తి పెంపుపై అధికారులకు ప్రశ్నలు & హెచ్చరికలు
బుధవారం జరిగిన విద్యుత్ సరఫరా సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తులో విద్యుత్ కొరత ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. నైనీ, మహానది నుంచి బొగ్గు లభ్యతకు పూర్తిస్థాయిలో లింకేజీలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్‌కో సీఎండీ సహా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, వెంటనే నివేదిక సమర్పించాలని మరియు సరఫరాను సాధారణ స్థితికి తేవాలని ఆదేశించారు.
Revanth Reddy: యూకే మేయర్ల ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
విద్యుత్ సమీక్షకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మేయర్ల ప్రతినిధి బృందం కలిసింది. ఈ సమావేశంలో తెలంగాణలో వివిధ రంగాల పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా హెల్త్‌కేర్, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్స్‌టైల్స్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సీఎం వారికి వివరించారు.
గ్లోబల్ సమ్మిట్ 2026కి యూకే ప్రతినిధుల ఆహ్వానం
ఈ భేటీ సందర్భంగా "యూకే-ఇండియా సీఈటీఏ అండ్ రీజనల్ సినర్జీస్"పై యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ రూపొందించిన నివేదికను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న "ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026"కు హాజరు కావాల్సిందిగా యూకే ప్రతినిధులను ఆయన సాదరంగా ఆహ్వానించారు.
Epaper: epaper.vaartha.com
అయ్యో దేవుడా.. వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని 9 నెలల బాలుడు మృతి

