Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్!

కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్!

వార్త 3 months ago

Huzurabad: హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రయత్నించాయి.

ఈ క్రమంలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read also: Tamilnadu Politics: తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ: విజయ్‌కు పెరుగుతున్న మద్దతు

 Police security at Huzurabad MLA office

Huzurabad: బీజేపి వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధం

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశం తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్తా పోరుగా మారింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళనలు చేపట్టగా, బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీటుగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది.

కరీంనగర్ బంద్.. కేటీఆర్ రాక

ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు జిల్లా అంతటా భారీగా మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రిపై తుది నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha