Karimnagar PMJ Robbery: కరీంనగర్ బంగారం షాప్ లో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురు దొంగలను కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల వద్ద నుండి పిస్టళ్లు, వాహనాలతో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర నుంచి బెంగాల్ వరకు బైక్‌లపై పారిపోయిన వీరిని పోలీసులు ఎంతో చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు. బీహార్, బెంగాల్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు సంచలనంగా మారింది.
PMJ Jewellery Robbery Case Arrests
Karimnagar PMJ Robbery: గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ మాస్టర్ ప్లాన్
ఈ భారీ చోరీ వెనుక బీహార్‌కు చెందిన పేరుమోసిన ‘గోల్డెన్ థీఫ్’ సుబోధ్ సింగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. జ్యువెలరీ షాపులో దొంగతనం చేయడానికి ఈ గ్యాంగ్ పక్కా స్కెచ్ వేసింది. ఈ దోపిడీలో మొత్తం ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొనగా, ఇప్పటివరకు ముగ్గురు దొొరికిపోయారు. సుబోధ్ సింగ్ నేతృత్వంలోని ఈ ముఠా దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
తనిఖీలు ముమ్మరం – పరారీలో మరో 10 మంది
ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న మరో 13 మందిని పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్‌తో పాటు మిగిలిన 10 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అంతరాష్ట్ర దొంగల ముఠా కావడంతో ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నారు. త్వరలోనే మిగిలిన వారిని పట్టుకొని పూర్తి స్థాయిలో నగలను రికవరీ చేస్తామని ఉన్నతాధికారులు దీనిపట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఎల్బీనగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి ICUలో చికిత్స

