Abhishek Sharma: ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ శనివారం ఆధ్యాత్మిక పర్యటనలో కనిపించాడు.
హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, జట్టు విజయం కోసం మరియు వ్యక్తిగత శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న అభిషేక్ శర్మకు ఆలయ అధికారులు మరియు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆలయ విశిష్టతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మైదానంలో పరుగుల వర్షం కురిపించే ఈ యువ ఆటగాడు, భక్తి భావంతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
Read Also: Heinrich Klaasen: హైదరాబాద్ ఆటోలో క్లాసెన్ షికారు.. 'కాటేరమ్మ కొడుకు' సింప్లిసిటీ చూశారా?
Abhishek Sharma worships at the Karmanghat temple.
Abhishek Sharma: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలను అభిషేక్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. “కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్” అనే క్యాప్షన్‌తో ఆయన పెట్టిన పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. ఎస్ఆర్ హెచ్ అభిమానులు స్వామివారి ఆశీస్సులతో అభిషేక్ మరిన్ని భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని కామెంట్లతో సందడి చేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నగరంలోని దేవాలయాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. గత నెలలో కూడా జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, ఆటగాళ్లు ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు ఇలాంటి సందర్శనలు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

