Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటక సీఎం మార్పుకు కారణం ఇదేనా ?

కర్ణాటక సీఎం మార్పుకు కారణం ఇదేనా ?

వార్త 3 months ago

Change in Karnataka CM : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటుచేసుకోబోతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసేందుకు రంగం సిద్ధమైనట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

అయితే, అధిష్ఠానం ఒత్తిడి కారణంగా కాకుండా, అత్యంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయన్ను ఎలా ఒప్పించిందనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో విస్తృతంగా తీసుకెళ్తున్న ‘సోషల్ జస్టిస్’ (సామాజిక న్యాయం) నినాదానికి బలం చేకూర్చడానికే ఈ మార్పు జరగనుందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బలమైన, ప్రజాదరణ కలిగిన ఒక ఓబీసీ (OBC) ముఖచిత్రం పార్టీకి అత్యంత అవసరమని కాంగ్రెస్ భావించింది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో తిరుగులేని ఓబీసీ లీడర్‌గా ఉన్న సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావడమే ఏకైక మార్గమని అధిష్ఠానం భావించినట్లు స్పష్టమవుతోంది.

Read Also : ప్రతి అక్రమ వలసదారుడిని వెనక్కి పంపుతాం: అమిత్ షా

 Siddaramaiah

రాజ్యసభ సీటుతో జాతీయ ప్రమోషన్ – సుదీర్ఘ చర్చల అనంతరం సిద్ధరామయ్య గ్రీన్ సిగ్నల్!

సిద్ధరామయ్యను కర్ణాటక సీఎం పీఠం నుంచి గౌరవప్రదంగా దించి, జాతీయ స్థాయిలో ఓబీసీల ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేసేందుకు హైకమాండ్ ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఆయనకు త్వరలోనే రాజ్యసభ సీటు కేటాయించి, కేంద్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి సిద్ధరామయ్య అనుభవం, సీనియారిటీ ఉపయోగపడతాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. మొదట్లో ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య కొంత విముఖత చూపినప్పటికీ.. ఏఐసీసీ (AICC) అగ్రనాయకత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాల వివరణ అనంతరం ఆయన ఈ మార్పునకు ఓకే చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామంతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ రేకెత్తించడమే కాకుండా, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో సరికొత్త మార్పులకు ఇది వేదిక కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రతి అక్రమ వలసదారుడిని వెనక్కి పంపుతాం: అమిత్ షా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha