గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ (Karur Stampede) లో జరిగిన రాజకీయ ప్రచార కార్యక్రమంలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ కేసులో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. జనసమూహ నిర్వహణ, ప్రణాళిక వైఫల్యాలపై సీబీఐ దృష్టి సారించింది.
UP: రూ. 500 నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన బీజేపీ నేత
సమగ్ర స్వతంత్ర దర్యాప్తు
ఈ నేపథ్యంలో, విచారణ కోసం సీబీఐ, విజయ్‌ను ఢిల్లీకి పిలిపించింది.తొక్కిసలాట ఘటనను తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కుట్రగా విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు బయటకు రావాలని, సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంపై టీవీకే తరఫున ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించగా.. విచారణకు సహకరిస్తానని విజయ్ ప్రకటించారు. కాగా, తమ నాయకుడు విజయ్ కు భద్రత కల్పించాలని టీవీకే పార్టీ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Silver price today : వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?

